Hyderabad: ఇంక్యుబేటర్ వేడి తట్టుకోలేక ఇద్దరు చిన్నారుల మృతి.... ఫలక్‌నూమా పరిధిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఘటన
- చిన్నారులను ఇంక్యుబేటర్‌లో ఉంచిన సిబ్బంది
- ఆపై అలాగే ఇంక్యుబేటర్‌లోనే వదిలేసిన వైనం
- ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమన్న ఆరోపణలు
హైదరాబాద్ పరిధిలోని ఫలక్‌నూమాలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. ఇంక్యుబేటర్‌లోని వేడిని తట్టుకోలేక ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనకు చిన్నారులు చికిత్స పొందుతున్న ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఫలక్‌నూమా పరిధిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఇద్దరు చిన్నారులను ఆసుపత్రి సిబ్బంది ఇంక్యుబేటర్‌లో ఉంచారు. నిర్దేశిత సమయం వరకే చిన్నారులను ఇంక్యుబేటర్‌లో పెట్టాల్సిన సిబ్బంది... వారిని ఎక్కువసేపు అలాగే వదిలేశారు. దీంతో ఇంక్యుబేటర్‌లో వేడి తట్టుకోలేక ఆ ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.