Telangana: ఫుడింగ్ పబ్ యజమాని అభిషేక్‌కు బెయిల్...మేనేజర్‌కు దొరకని ఊరట
- పబ్‌లో దొరికిన 4.6 గ్రాముల కొకైన్
- యజమాని అభిషేక్, మేనేజర్ అనిల్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు
- అభిషేక్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు
హైదరాబాద్‌లో కలకలం రేపిన ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో పబ్ యజమాని ఉప్పాల అభిషేక్‌కు బెయిల్ లభించింది. ఇదే కేసులో అభిషేక్‌తో పాటు అరెస్టయిన పబ్ మేనేజర్ అనిల్‌కు మాత్రం బెయిల్ దక్కలేదు. ఈ మేరకు మంగళవారం ఇద్దరు నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు అభిషేక్‌కు మాత్రమే బెయిల్ మంజూరు చేసింది.
గత నెలలో ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌పై పోలీసులు దాడి జరపగా...4.6 గ్రాముల కొకైన్ పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1గా పబ్ మేనేజర్ అనిల్‌ను, ఏ2గా అభిషేక్‌ను చేర్చిన పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. అయితే తమకు బెయిల్ ఇవ్వాలంటూ వారు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దీంతో అభిషేక్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. రెండు వారాలకు ఓ మారు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలని ఆయనకు షరతు విధించింది.