Naraaraopet MP: కిష‌న్ రెడ్డితో వైసీపీ ఎంపీ శ్రీకృష్ణదేవ‌రాయ‌లు భేటీ... కోట‌ప్పకొండ‌ను 'ప్ర‌సాద్' పథకంలో చేర్చాలని విన‌తి

ysrcp mp Sri Krishna Devarayulu meets union minister kishan reddy
  • రాయల కాలం నుండి వెలుగొందుతున్న శైవ క్షేత్రం కోట‌ప్ప‌కొండ‌
  • ప‌ర్యావ‌ర‌ణ ప‌ర్యాట‌క కేంద్రంగా రూపొందిస్తున్నామని వెల్లడి  
  • రాష్ట్ర ప్ర‌భుత్వానికి తోడ్పాటు అందించాల‌న్న ఎంపీ
వైసీపీ యువ నేత‌, న‌ర‌స‌రావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవ‌రాయ‌లు మంగ‌ళ‌వారం కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కిష‌న్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా త‌న నియో‌జ‌కవ‌ర్గ ప‌రిధిలోని కోట‌ప్ప‌కొండ‌కు కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న 'ప్ర‌సాద్' ప‌థ‌కాన్ని వ‌ర్తింప‌జేయాల‌ని కోరారు. ఈ మేర‌కు కిష‌న్ రెడ్డికి ఎంపీ ఓ విన‌తి ప‌త్రాన్ని స‌మ‌ర్పించారు.

కోట‌ప్పకొండ‌ను ఆర్తుల అండగా అభివ‌ర్ణించిన వైసీపీ ఎంపీ... శ్రీకృష్ణదేవరాయలు కాలం నుండి దేదీప్యమానంగా వెలుగొందుతున్న శైవక్షేత్రంగా పేర్కొన్నారు. ఈ కార‌ణంగా కోట‌ప్ప‌కొండ‌ను ప‌ర్యావ‌ర‌ణ ప‌ర్యాట‌క ప్ర‌దేశంగా మ‌లిచేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌కు తోడ్పాటు అందించాల‌ని కోరారు. అందుకోసం ప్ర‌సాద్ ప‌థ‌కాన్ని కోటప్ప‌కొండ‌కు వ‌ర్తించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.
Naraaraopet MP
YSRCP
Sri Krishna Devarayulu Lavu
Kotappakonda
Kishan Reddy

More Telugu News