Apple: యాపిల్ ఐపాడ్ టచ్ ఇక కనిపించదు.. 20 ఏళ్ల అనంతరం నిలిపివేత

Apple discontinues iPod Touch after over 20 years says it is available while stocks last

  • స్టాక్స్ ఉన్నంత వరకు విక్రయాలు వుంటాయన్న యాపిల్ 
  • అనంతరం అందుబాటులో ఉండదని ప్రకటన 
  • మిలియన్ల జీవితాలపై ప్రభావం చూపించిందన్న గ్రెగ్ జోస్విక్

యాపిల్ సంస్థ 20 ఏళ్ల తర్వాత యాపిల్ ఐపాడ్ టచ్ ను నిలిపివేసింది. 2001లో దీన్ని యాపిల్ ఆవిష్కరించింది. ఐపాడ్ టచ్ స్టాక్ ఉన్నంత వరకే అమ్మకాలు కొనసాగుతాయని.. అనంతరం ఈ ఉత్పత్తి ఇక అందుబాటులో ఉండదని యాపిల్ ప్రకటన విడుదల చేసింది. 

ఐపాడ్ స్ఫూర్తి కంపెనీకి చెందిన ఇతర ఉత్పత్తుల్లో ప్రలిఫలిస్తుందని యాపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గ్రెగ్ జోస్విక్ ప్రకటించారు. సంగీతం అన్నది యాపిల్ ఉత్పత్తుల్లో అంతర్లీనంగా ఉంటుందన్నారు. సంగీత పరిశ్రమ కంటే మించి వందలాది మిలియన్లపై యాపిల్ ఐపాడ్ ప్రభావం చూపించినట్టు పేర్కొన్నారు. సంగీత అన్వేషణ, ఆస్వాదన, పంచుకోవడాన్ని ఐపాడ్ మార్చేసిందన్నారు. 

చేతిలో ఒదిగిపోవడం, టచ్ తో నచ్చిన పాటలను ఎంపిక చేసుకుని వినడం.. ఈ సౌకర్యం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి ఐపాడ్ టచ్ ను చేరువ చేసింది. దీంతో యాపిల్ కు కీలక ఉత్పత్తుల్లో ఒకటిగా ఇది అమ్మకాలు సాగించింది. కానీ స్మార్ట్ ఫోన్ల రాక తర్వాత ఐపాడ్ టచ్ కు ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. చివరికి నిలిపివేతకు దారితీసింది.

  • Loading...

More Telugu News