Amit Shah: కలలు సాకారం కాగలవని ప్రధాని మోదీ నిరూపించారు: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

Amit Shah recalls Modis journey from Gujarat CM to PM at Modi20 book launch event
  • మోదీ@20: డ్రీమ్స్ మీట్ డెలివరీ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి
  • పంచాయతీని పాలించిన అనుభవం కూడా లేదన్న అమిత్ షా 
  • అయినా సీఎంగా రాణించారంటూ ప్రశంసలు 
  • వరుసగా ఎన్నికల్లో విజయం సాధించారని కితాబు 
ప్రధాని నరేంద్ర మోదీ.. 20 ఏళ్ల పాలనపై రాసిన పుస్తకం ‘మోదీ@20: డ్రీమ్స్ మీట్ డెలివరీ’ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. బుధవారం ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. కలలు సాకారం కాగలవని మోదీ ప్రపంచానికి చాటి చెప్పినట్టు పేర్కొన్నారు. నరేంద్ర మోదీలోని విభిన్న ఆలోచనా ప్రక్రియ, విభిన్న కోణాలు, మార్గదర్శకత్వం, చురుకైన విధానం, సర్వోత్కృష్టమైన పరివర్తన నాయకత్వ శైలికి గుర్తింపు లభించినట్టు చెప్పారు.  

హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ప్రధానిని సమర్థుడైన నేతగా కొనియాడారు. ''భూకంపంతో కుదేలైన గుజరాత్ రాష్ట్రానికి మోదీ సీఎం అయ్యే సమయానికి పంచాయతీని పాలించిన అనుభవం కూడా లేదు. అయినా, సమర్థవంతంగా పాలించడం ద్వారా తదుపరి ఎన్నికల్లోనూ తిరిగి విజయం సాధించారు’’ అని తెలిపారు. 

జైశంకర్ మాట్లాడుతూ.. ఎనిమిదేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదంపై చర్చకు ప్రధాని నాయకత్వం వహించినట్టు చెప్పారు. ‘‘అభివృద్ధి ఆధారిత దౌత్యాన్ని అనుసరించారు. భద్రతా పరమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టారు. ఎగుమతులను 400 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లారు’’ అని జైశంకర్ వివరించారు. 

Amit Shah
Venkaiah Naidu
pm
modi
book
Modi@20

More Telugu News