Google Pixel 7: గూగుల్ నుంచి పిక్సల్ 7 సహా నాలుగు సూపర్ గ్యాడ్జెట్స్

Google Pixel 7 makes a surprise appearance Pixel Watch Pixel tablets Buds Pro coming too

  • గూగుల్ నుంచి తొలి స్మార్ట్ వాచ్
  • పిక్సల్ బడ్స్ ప్రో కూడా రానున్నాయ్
  • 2023లో రానున్న పిక్సల్ ట్యాబ్లెట్
  • గూగుల్ ఐవో సదస్సులో ఆవిష్కరణలు

గూగుల్ ఐవో వార్షిక ఈవెంట్ లో.. నూతన ఉత్పత్తులను ఆవిష్కరించనున్నట్టు  గూగుల్ సంస్థ టీజర్ విడుదల చేసింది. పిక్సల్ 7, పిక్సల్ 7 ప్రో, గూగుల్ పిక్సల్ వాచ్, గూగుల్ పిక్సల్ ట్యాబ్, పిక్సల్ బడ్స్ ప్రోను విడుదల చేయనుంది. ఇవి ముందుగా అమెరికా మార్కెట్లో విడుదల కానున్నాయి. బుధ, గురువారాల్లో గూగుల్ ఐవో జరుగుతోంది. 

పిక్సల్ 7, 7 ప్రో
పిక్సల్ 6 సిరీస్ డిజైన్ ను పోలి ఉంటుంది. కెమెరా బార్ అల్యూమినియం ఫినిష్ తో కనిపిస్తుంది. పిక్సల్ 7లో డ్యుయల్, 7ప్రోలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. గూగుల్ తదుపరి జనరేషన్ టెన్సార్ చిప్ తో పిక్సల్ 7 ఫోన్లు రానున్నాయి. గ్లాస్ బ్లాక్ ఫినిష్ తో ఇవి ఉంటాయి. కెమెరా స్పెసిఫికేషన్ల గురించి మార్కెట్లో అంచనాలు ఉన్నాయి కానీ, అవన్నీ ఊహాగానాలే. ఈ ఏడాది చివర్లో ఇవి మార్కెట్లోకి రానున్నాయి.

పిక్సల్ వాచ్
గూగుల్ నుంచి వస్తున్న తొలి స్మార్ట్ వాచ్. గుండ్రటి డయల్ తో చూడ్డానికి ఆకర్షణీయంగా ఉండనుంది. స్టెయిన్ లెస్ స్టీల్ తో దీన్ని తయారు చేశారు. వేర్ ఓఎస్ తో ఈ వాచ్ పనిచేస్తుంది. హెల్త్, ఫిట్ నెస్ ఫీచర్లతో రానుంది. గుండె రేటు, నిద్ర తీరును ట్రాక్ చేసే ఫీచర్లు కూడా ఉంటాయి. ఎన్ఎఫ్ సీ పేమెంట్స్ ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఏడాది చివర్లో ఇది అందుబాటులోకి వస్తోంది.

పిక్సల్ ట్యాబ్లెట్
ఇది 2023లో రానుంది. గూగుల్ టెన్సార్ చిప్ తో పనిచేస్తుంది. వెనుక భాగంలో ఒకటే కెమెరా ఉంటుంది. 

పిక్సల్ బడ్స్ ప్రో
నాలుగు భిన్న రంగుల్లో ఇయర్ బడ్స్ రానున్నాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సదుపాయం వీటిల్లో ఉంది. ఇయర్ బడ్స్ చెవిలో పూర్తిగా ఒదిగిపోతాయి. బయటి శబ్దాలు వినిపించవు. బ్యాటరీ లైఫ్ ఏడు గంటలు. వీటి ధర 200 డాలర్లు ఉండొచ్చని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News