Andhra Pradesh: ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా ముఖేశ్ కుమార్ మీనా నియామకం
- 1998 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ముఖేశ్
- రాష్ట్ర విభజనలో ఏపీ కేడర్‌ను ఎంచుకున్న వైనం
- వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ముఖేశ్
- త్వరలోనే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా బాధ్యతలు
ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముఖేశ్ కుమార్ మీనా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటిదాకా ఈ పదవిలో మరో సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా విజయానంద్ స్థానంలో ముఖేశ్ కుమార్ మీనాను ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.
1998 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ముఖేశ్ కుమార్ మీనా ఉమ్మడి రాష్ట్ర కేడర్‌ను ఎంచుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆయన ఏపీ కేడర్‌కు ఆప్షన్ ఇవ్వగా...ఆ మేరకే ఏపీ కేడర్‌కు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఏపీ వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆయన పనిచేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో త్వరలోనే ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.