Bandi Sanjay: కేటీఆర్ లీగల్ నోటీసులపై బండి సంజయ్ స్పందన ఇదే!
- కేటీఆర్ వల్లే 27 మంది ఇంటర్ విద్యార్థులు చనిపోయారన్న బండి సంజయ్
- ఆ వ్యాఖ్యల ఆధారంగానే ఆయనకు కేటీఆర్ నోటీసులు
- దమ్ముంటే సీబీఐ విచారణకు సిద్ధపడాలన్న బండి సంజయ్
సీఎం కేసీఆర్‌పైనా, తనపైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా దాఖలు చేస్తానంటూ లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులపై తాజాగా బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదంటూ బండి సంజయ్ పేర్కొన్నారు.
మంత్రి కేటీఆర్ వల్ల 27 మంది ఇంటర్ విద్యార్థులు చనిపోయారంటూ బండి సంజయ్ చేసిన ట్వీట్ ఆధారంగానే ఆయనకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. విద్యార్థుల ఆత్మహత్యలపై దమ్ముంటే సీబీఐ విచారణకు సిద్ధపడాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. సీబీఐ విచారణ జరిగితే విద్యార్థుల ఆత్మహత్యలకు కారకులెవరో తెలుస్తుంది కదా? అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే హామీలిచ్చి మోసం చేస్తున్న మీపై 420 కేసులు నమోదు చేయాలంటూ సంజయ్ మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు,