Congress: కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాంగ్రెస్ పాదయాత్ర.. రాహుల్ సైతం

Congress plans padyatras from Kashmir to Kanyakumari to raise unemployment issue

  • ప్రజలతో జనతా దర్బార్ కార్యక్రమం
  • నిరుద్యోగం, ఇతర  ప్రధాన సమస్యల ప్రస్తావన
  • రాహుల్ గాంధీ సహా సీనియర్ నేతలకు చోటు
  • ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు కార్యక్రమాలు

కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పాద యాత్రలు చేపట్టాలని భావిస్తోంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాద యాత్రలు, జనతా దర్బార్ (ప్రజా సమావేశాలు) నిర్వహించడం ద్వారా తిరిగి పెద్ద సంఖ్యలో ప్రజల మనసులను చేరుకోవాలని యోచిస్తోంది. రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 
 
నిరుద్యోగ అంశాన్ని ప్రధానంగా కాంగ్రెస్ ప్రస్తావించనుంది. ఉదయ్ పూర్ లోని పార్టీ చింతన్ శిబిరంలో భాగంగా ఇందుకు సంబంధించి ‘జన జాగరణ్ అభియాన్‘ కార్యక్రమం చర్చకు వచ్చినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఒక వివరణాత్మక ప్రెజెంటేషన్ ఇచ్చినట్టు తెలిపాయి. దేశవ్యాప్తంగా ప్రజలకు కాంగ్రెస్ ను చేరువ చేసేందుకు యూత్ కాంగ్రెస్ కూడా ఇటువంటి ప్రతిపాదనే చేసినట్టు పేర్కొన్నాయి. 

‘‘ఈ ప్రతిపాదన దాదాపుగా ఖాయమైనట్టే. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఈ యాత్రను చేపడుతుంది. ప్రజలను నేరుగా కలుసుకునే లక్ష్యంలో భాగంగా జనతా దర్భార్ లను కూడా నిర్వహించాలన్న ప్రతిపాదన ఉంది’’అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. 

  • Loading...

More Telugu News