Corbevax: చిన్నారుల‌కిచ్చే వ్యాక్సిన్‌ 'కార్బెవ్యాక్స్' ధ‌ర భారీగా త‌గ్గింపు

corbevax price slashed to 250

  • కార్బెవ్యాక్స్ ధ‌ర ప్ర‌స్తుతం రూ.840
  • ఇక‌పై రూ.250కే ల‌భించ‌నున్న వ్యాక్సిన్‌
  • వ్యాక్సిన్ ధ‌ర‌ను భారీగా త‌గ్గించిన బ‌యా‌లాజిక‌ల్ -ఇ లిమిటెడ్‌
  • వ్యాక్సినేష‌న్ కేంద్రాల చార్జీల‌తో రూ.400ల‌కే వ్యాక్సిన్‌

ప్ర‌స్తుతం 12 నుంచి 17 ఏళ్ల వ‌య‌సు మ‌ధ్య పిల్ల‌ల‌కు ఇస్తున్న క‌రోనా వ్యాక్సిన్‌ కార్బెవ్యాక్స్ ధ‌ర భారీగా త‌గ్గింది. నిన్న‌టిదాకా రూ.840కి ల‌భ్య‌మ‌వుతున్న ఈ వ్యాక్సిన్ ధ‌ర తాజాగా రూ.250కి త‌గ్గిపోయింది. అది కూడా ప‌న్నుల‌న్నీ క‌లిపితే కూడా వ్యాక్సిన్ ధ‌ర రూ.250కే అంద‌నుంది. ఈ మేర‌కు కార్బెవ్యాక్స్ త‌యారీదారు బ‌యాలాజిక‌ల్-ఇ లిమిటెడ్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కంపెనీ నుంచి వ్యాక్సిన్ రూ.250కే అందినా.. వ్యాక్సిన్ కేంద్రాలు వ‌సూలు చేసే అద‌న‌పు చార్జీల‌తో క‌లిపి ఈ వ్యాక్సిన్ రూ.400ల‌కు ల‌భించ‌నుంది.

హైద‌రాబాద్ కేంద్రంగా కార్య‌క‌లాపాలు సాగిస్తున్న బ‌యా‌లాజిక‌ల్-ఇ లిమిటెడ్ అభివృద్ధి చేసిన కార్బెవ్యాక్స్ ను త్వ‌ర‌లోనే 5 నుంచి 12 ఏళ్ల వ‌య‌సున్న పిల్ల‌లకు వేయ‌నున్నారు. ఇటీవ‌లే ప్రభుత్వం నుంచి ఈ మేరకు అనుమ‌తి కూడా వ‌చ్చింది. ప్ర‌స్తుతం 12- 17 ఏళ్ల వ‌య‌సు పిల్ల‌లకు ఈ వ్యాక్సిన్ వేస్తుండ‌గా, త్వ‌ర‌లోనే 5- 12 ఏళ్ల పిల్ల‌లకూ ఈ వ్యాక్సిన్ అందించ‌డానికి ముందే వ్యాక్సిన్ ధ‌ర‌ను భారీగా త‌గ్గిస్తూ బ‌యా‌లాజిక‌ల్‌-ఇ లిమిటెడ్ కీల‌క నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.

  • Loading...

More Telugu News