K A Paul: సేవ చేసేందుకు నాకు ఒక్క అవ‌కాశం ఇవ్వండి!: కేఏ పాల్

ka paul comments on telangana and national politics

  • బీజేపీ అంటే కాంగ్రెస్‌కు భ‌యం
  • మిగిలిన అన్ని పార్టీలు బీజేపీ అనుబంధ పార్టీలే
  • నా వెనుక బీజేపీ లేదు
  • తెలంగాణ‌లో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పాయ‌న్న కేఏ పాల్‌

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు త‌న‌కు ఒక్క అవ‌కాశం ఇవ్వాల‌ని రాష్ట్ర ఓట‌ర్ల‌కు ప్ర‌జా శాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ విజ్ఞ‌ప్తి చేశారు. ఇప్ప‌టిదాకా ఎవ‌రెవ‌రికో దోచుకునే వారికే అవ‌కాశం ఇచ్చార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా కేఏ పాల్ రాష్ట్ర రాజ‌కీయాల‌తో పాటు జాతీయ రాజ‌కీయాల‌పైనా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 

కులాలు, మ‌తాల పేరుతో చిచ్చు పెట్టేవారిని ఉపేక్షించే ప్ర‌సక్తే  లేద‌ని కేఏ పాల్ హెచ్చ‌రించారు. దేశంలో ఉన్న పార్టీల‌న్నీ అవినీతి, కుటుంబ పార్టీలేన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ అంటే భ‌య‌మ‌న్న పాల్‌.. దేశంలోని మిగిలిన అన్ని పార్టీలు బీజేపీ అనుబంధ పార్టీలేన‌ని చెప్పారు. 

త‌న వెనుక బీజేపీ ఉంద‌నే విమ‌ర్శ‌లు అర్థ‌ర‌హిత‌మ‌న్న పాల్‌... అవి ప‌నిలేని కొంద‌రు చేసే విమ‌ర్శ‌లుగా కొట్టిపారేశారు. చేసిన త‌ప్పుల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకే టీఆర్ఎస్ ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తోంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. తెలంగాణ‌లో శాంతి భ‌ద్ర‌త‌లు పూర్తిగా అదుపు త‌ప్పాయ‌ని కేఏ పాల్‌ విమ‌ర్శించారు.

  • Loading...

More Telugu News