Kangana Ranaut: ఢిల్లీ కుర్రాళ్లు చాలా మంచోళ్లు.. బయటకు తీసుకెళ్లి అన్నీ కొనిస్తారు: కంగన
- తమ బిల్లులు వాళ్లే కట్టేవాళ్లన్న కంగన
- ముంబైలో సంస్కృతి చూసి షాక్ అయ్యానని వ్యాఖ్య
- డేటింగ్ చేస్తున్నా ఎవరిది వారే కట్టుకోవాలన్న కంగన
బాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్న కంగనా రనౌత్.. నటి కాక ముందు లైఫ్ ఎలా ఉండేదో ఒక యూ ట్యూబ్ చానల్ తో పంచుకుంది. ఢిల్లీలో తాను, తన స్నేహితురాళ్లు బోయ్ ఫ్రెండ్స్ పైనే ఆధారపడే వాళ్లమని ఆమె చెప్పడం విశేషం. మోడల్ కావాలన్న ఆకాంక్షతో 16 ఏళ్ల వయసులోనే ఆమె హిమాచల్ ప్రదేశ్ నుంచి బయటకు వచ్చింది. 2006లో 'గ్యాంగ్ స్టర్' సినిమా లో చాన్స్ లభించే వరకు ఆమె ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నవారే.
తాను ముందుగా రూ.10,000తో ఢిల్లీకి వచ్చి, ఫ్రెండ్ తో కలసి పీజీ హాస్టల్ లో చేరినట్టు కంగన చెప్పింది. ఆ తర్వాత ఓ మోడలింగ్ ఏజెన్సీ అవకాశం ఇవ్వడంతో ఆమె ముంబైకి మారిపోయింది. ఢిల్లీలో ఉన్నంత కాలం తమ ఖర్చులను అబ్బాయిలే భరించే వారని ఆమె చెప్పింది.
‘‘ఇప్పుడు ఢిల్లీలో ఎలా ఉందో తెలియదు. కానీ, అప్పట్లో మేము 5-6 బాలికలం కలసి ఉండేవాళ్లం. మా అందరికీ పురుష స్నేహితులు ఉండేవాళ్లు. వారిని మేము డ్రైవర్లుగా మార్చుకున్నాం. వారు మమ్మల్ని బయటకు తీసుకెళ్లే వారు. మా తరఫున బిల్లులను వారే కట్టేవారు. ఢిల్లీ అబ్బాయిలకు ఇది కాంప్లెమెంట్.
వారు మా బిల్లులను కట్టినా, మేము కొంచమే తినేవాళ్లం. ఫ్యాన్సీ ప్రదేశాలకు తీసుకెళ్లేవారు. నాకు సంపాదన వచ్చిన సందర్భాల్లో నేను కూడా ఖర్చు చేసే దాన్ని. కనుక బిల్లులు కట్టే విషయంలో అసలు ఒత్తిడే ఉండేది కాదు. కానీ, ఢిల్లీ నుంచి ముంబైకి మారిపోయిన తర్వాత అక్కడి సంస్కృతి చూసి షాక్ అయ్యాను. చండీగఢ్ లో డేట్ చేసినా నేను రూపాయి చెల్లించలేదు. కానీ, ముంబై అలా కాదు. అంతా ప్రాక్టికల్. డేట్ లో ఉన్నా సరే ఎవరిది వారే చెల్లించాలి. నీరు కావాలన్నా డబ్బులు చెల్లించాలి’’ అని కంగన తన జీవిత అనుభవాలను వెల్లడించింది.