monkey pox: అమెరికాకు పాకిన మంకీ వైరస్.. తొలి కేసు నమోదు
- మస్సాచుసెట్స్ కు చెందిన వ్యక్తిలో గుర్తింపు
- ఇటీవలే కెనడాకు ప్రయాణించి వచ్చిన వ్యక్తి
- మరిన్ని కేసులు వస్తాయన్న అంచనాలు
అమెరికాలో మంకీ పాక్స్ వైరస్ వెలుగు చూసింది. మస్సాచుసెట్స్ లో తొలి కేసు నమోదైంది. మంకీ వైరస్ సోకిన వ్యక్తి ఇటీవలే కెనడాకు ప్రయాణించినట్టు గుర్తించారు. దీంతో మరిన్ని మంకీ పాక్స్ వైరస్ కేసులు వెలుగు చూసే అవకాశం ఉందని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ విభాగం అంచనా వేస్తోంది.
మంకీ వైరస్ సోకిన వ్యక్తి ఎవరెవరితో కలిశాడన్న వివరాలను ఆరా తీస్తున్నారు. ఇప్పటికైతే ఈ వైరస్ తో ప్రజారోగ్యానికి ఎలాంటి మప్పు లేదని అధికారులు భావిస్తున్నారు. పోర్చుగల్ లో ఐదు మంకీ పాక్స్ కేసులు నమోదు కాగా, బ్రిటన్ లోనూ రెండు కేసులు వెలుగు చూశాయి. సాధారణంగా ఆఫ్రికాకే పరిమితమైన ఈ వైరస్ యూరోప్, అమెరికాను చేరడం గమనించాలి. స్పెయిన్ హెల్త్ విభాగం సైతం 23 కేసులు వెలుగు చూసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.