Congress: సరిహద్దుల్లో చైనా అక్రమ నిర్మాణాలపై ప్రధాని మోదీని టార్గెట్ చేసిన కాంగ్రెస్

Congress targets PM Modi over China activities in border

  • దురాక్రమణ బుద్ధిని చాటుకున్న చైనా
  • పాంగోంగ్ సరస్సు వద్ద మరో వంతెన
  • కేంద్రం మౌనం వీడాలన్న కాంగ్రెస్
  • ప్రధానిదే బాధ్యత అన్న రాహుల్ గాంధీ

చైనా దురాక్రమణ నైజం మరోసారి బట్టబయలైంది. సరిహద్దుల్లోని పాంగోంగ్ త్సో సరస్సుపై మరో భారీ వంతెన నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు కురిపించింది. దేశ జాతీయ భద్రతను, ప్రాదేశిక సమగ్రతను ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయజాలరని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హితవు పలికారు. 

చైనా దూకుడు పట్ల పిరికితనం, అతి మంచితనంతో కూడిన స్పందనలు పనిచేయవని పేర్కొన్నారు. దేశ ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రధానిదేనని స్పష్టం చేశారు. పాంగోంగ్ లో చైనా తొలి వంతెన కట్టినప్పుడు చెప్పిన జవాబునే కేంద్రం ఇప్పుడు కూడా చెబుతోందని, సరిహద్దుల్లో పరిస్థితిని తాము నిశితంగా పరిశీలిస్తున్నామని అంటోందని విమర్శించారు.  

కాగా, కాంగ్రెస్ పార్టీ కూడా చైనా వ్యవహారంలో కేంద్రం తీరును ప్రశ్నించింది. చైనా ఓవైపు సరిహద్దుల్లో భారీ కట్టడాలు చేపడుతుంటే కేంద్రం ఎందుకు మౌనంగా ఉంటోందని కాంగ్రెస్ నిలదీసింది.

  • Loading...

More Telugu News