Chandrababu: ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేసేంతవరకు మా పోరాటం ఆగదు: చంద్రబాబు

Chandrababu says Our fight will not stop till Anantha Babu is arrested

  • వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారులో శవం
  • విగతజీవుడిగా మాజీ డ్రైవర్
  • కాకినాడ జీజీహెచ్ లో మృతదేహం
  • పోలీసులతో టీడీపీ నేతల వాగ్వాదం

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారులో మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం శవమై తేలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కాగా, సుబ్రహ్మణ్యం మృతదేహానికి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంకా పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉంది. అయితే, ఆసుసత్రి వద్దకు వెళ్లిన టీడీపీ నిజనిర్ధారణ కమిటీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. 

టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులను అడ్డుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలో టీడీపీ నేతలపై పోలీసుల వైఖరి దారుణమని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ మృతి కేసులో నిజానిజాలు తేలాలని డిమాండ్ చేశారు. హత్య కేసు నిందితులను రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రధాన నిందితుడు అనంతబాబును అరెస్ట్ చేసేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News