Tamil Nadu: పెట్రో ధరల వ్యవహారం... కేంద్రంపై భగ్గుమన్న తమిళనాడు

Tamil Nadu govt fires on Center over petro prices issue

  • దేశంలో తగ్గిన ఇంధన ధరలు
  • పెట్రోల్, డీజిల్ పై భారీగా తగ్గిన ఎక్సైజ్ సుంకం
  • రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాలంటున్న బీజేపీ నేతలు
  • పెంచినప్పుడు మాకు చెప్పారా? అంటూ తమిళనాడు మంత్రి ఫైర్

కేంద్రం నిన్న పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించడం తెలిసిందే. పెట్రోల్ లీటర్ పై రూ.8, డీజిల్ లీటర్ పై రూ.6 ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో, బీజేపీ నేతలు రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై తమిళనాడు ఆర్థికమంత్రి త్యాగరాజన్ మండిపడ్డారు. 

పెట్రో ధరలు పెంచినప్పుడు మమ్మల్ని అడిగి పెంచారా? అంటూ నిలదీశారు. అలాంటప్పుడు పన్నులు తగ్గించాలని మమ్మల్నెలా అడుగుతారు? అని ప్రశ్నించారు. అది కూడా గతంలో పెంచిన ధరల నుంచి కొద్దిగా తగ్గించారని త్యాగరాజన్ విమర్శించారు. గతంలో ఇంధన ధరలు పెంచినప్పుడు ఏనాడూ కేంద్రం రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోలేదని, ఏకపక్షంగా ముందుకెళ్లిందని పేర్కొన్నారు. ఇప్పుడు పన్నులు తగ్గించాలంటూ రాష్ట్రాలకు చెబుతోందని, ఇది సమాఖ్య స్ఫూర్తి అనిపించుకుంటుందా? అని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News