Davos: ఓ వైపు జగన్, మరోవైపు ఇద్దరు మంత్రులు.. దావోస్‌లో బిజీబిజీగా ఏపీ బృందం
- ఆదివారం మొదలైన దావోస్ సదస్సు
- రాష్ట్రంలోని స్థితిగతులపై చర్చలో పాల్గొన్న జగన్
- వెస్టాస్ ప్రెసిడెంట్‌తో సమావేశమైన బుగ్గన, గుడివాడ
దావోస్ వేదికగా ఆదివారం ప్రారంభమైన వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఎఫ్) సదస్సులో ఏపీ ప్రతినిధి బృందం బిజీ బిజీగా సాగుతోంది. ఈ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేరుగా డబ్ల్యూఎఫ్ చీఫ్ సహా పలు దిగ్గజ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు వేస్తుండగా... ఆయన వెంట దావోస్ వెళ్లిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌లు ఓ జట్టుగా ఏర్పడి వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీలు నిర్వహిస్తున్నారు.
సదస్సులో రెండో రోజైన సోమవారం ఈ తరహా పరిణామం విస్పష్టంగా కనిపించింది. రాష్ట్రంలోని పరిస్థితులు, కరోనా నివారణకు తీసుకున్న చర్యలు తదితరాలపై జరిగిన చర్చలో సీఎం జగన్ పాలుపంచుకుంటే... బుగ్గన, గుడివాడ మాత్రం పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ఇందులో భాగంగా వెస్టాస్ ప్రెసిడెంట్ హెన్రిక్ ఆండర్సన్‌తో భేటీ అయ్యారు.