Asthma: కరోనా ఎఫెక్ట్.. ఈసారి కూడా చేప ప్రసాదం పంపిణీ లేదన్న బత్తిని సోదరులు
- మృగశిర కార్తె రోజున చేప ప్రసాదం పంపిణీ చేస్తున్న బత్తిని సోదరులు
- కరోనా కారణంగా 2020 నుంచి నిలిచిపోయిన పంపిణీ
- మహమ్మారి ప్రభావం ఇంకా ఉండడంతో పంపిణీ చేయరాదని నిర్ణయం
ఆస్తమా రోగులకు ఇది నిరాశ కలిగించే వార్తే. ఈసారి కూడా చేప ప్రసాదం పంపిణీ చేయడం లేదని బత్తిని సోదరులు ప్రకటించారు. ఆస్తమా రోగుల కోసం ప్రతి ఏడాది మృగశిర కార్తె ప్రవేశం రోజున చేప ప్రసాదాన్ని పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. హైదరాబాద్ దూద్‌బౌలికి చెందిన బత్తిని హరినాథ్‌గౌడ్, బత్తిని గౌరీశంకర్ గౌడ్, బత్తిని శివకుమార్ గౌడ్, బత్తిని అమర్‌నాథ్ గౌడ్ సోదరులు ఏళ్లుగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు.
అయితే, కరోనా మహమ్మారి నేపథ్యంలో 2020 నుంచి ప్రసాదం పంపిణీని నిలిపివేశారు. కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతుండడంతో ఈసారి కూడా చేప ప్రసాదాన్ని పంపిణీ చేయడం లేదని బత్తిని సోదరులు తెలిపారు.