Reliance Jio: ప్రీపెయిడ్ వినియోగదారులను మూకుమ్మడిగా బాదేందుకు సిద్ధమైన టెలికం కంపెనీలు

Jio Vi and Airtel May Increase Prepaid Recharge Plans by Diwali

  • దీపావళి నాటికి పెంపు యోచనలో కంపెనీలు
  • గతేడాదే ధరలు పెంచిన వైనం
  • ఏఆర్‌పీయూ పెంచుకోనున్న టెలికం సంస్థలు

దేశంలోని ప్రముఖ టెలికం కంపెనీలైన ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వీఐ (వొడాఫోన్ ఐడియా)లు ప్రీపెయిడ్ వినియోగదారులను బాదేందుకు సిద్ధమయ్యాయి. దీపావళి (నవంబరు) నాటికి ప్రీపెయిడ్ చార్జీలను 10 నుంచి 12 శాతం మేర పెంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా, గతేడాది నవంబరులోనే ఎయిర్‌టెల్, వొడాఫోన్ కంపెనీలు ప్రీపెయిడ్ చార్జీలను 20 నుంచి 25 శాతం మేరకు పెంచగా, అదే ఏడాది డిసెంబరులో జియో కూడా పెంచింది. 

ఇక, తాజా నిర్ణయంతో ఒక్కో వినియోగదారు నుంచి సగటు ఆదాయాన్ని (ఏఆర్‌పీయూ) ఎయిర్‌టెల్ రూ. 200కు, జియో రూ. 185కు, వీఐ రూ. 135 పెంచుకునే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ఈక్విటీ రీసెర్చ్ సంస్థ విలియమ్ ఓ నీల్ అండ్ కో భారత ప్రతినిధి మయూరేశ్ జోషి తెలిపారు.

  • Loading...

More Telugu News