Narendra Modi: తమిళ భాష శాశ్వతమైనది: ప్రధాని మోదీ

Modi lauds Tamil language in his Tamilandu visit

  • తమిళనాడులో ప్రధాని మోదీ పర్యటన
  • రూ.31 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన
  • తమిళ సంస్కృతి విశ్వవ్యాపితం అని వ్యాఖ్యలు
  • తమిళనాడు ప్రత్యేక ప్రాంతం అని కితాబు

ప్రధాని నరేంద్ర మోదీ నేడు తమిళనాడు పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా రూ.32 వేల కోట్ల విలువైన 11 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వీటిలో 262 కిమీ పొడవైన చెన్నై-బెంగళూరు ఎక్స్ ప్రెస్ హైవే కూడా ఉంది. తమిళనాడు పర్యటనలో ప్రధాని మోదీ తమిళ భాషపై ప్రేమాభిమానాలు కనబరిచారు. తమిళం శాశ్వతమైన భాష అని అభివర్ణించారు. తమిళనాడు ఓ ప్రత్యేకమైన ప్రాంతం అని, తమిళ సంస్కృతి విశ్వవ్యాప్తం అని కీర్తించారు. 

జాతీయ విద్యావిధానాన్ని వివరిస్తూ, సాంకేతిక, వైద్య కోర్సులు స్థానిక భాషల్లో అభ్యసించడం తమిళనాడు యువతకు ఎంతో లాభదాయకమని మోదీ పేర్కొన్నారు. 

శ్రీలంక సంక్షోభంపైనా ప్రధాని మోదీ స్పందించారు. అత్యంత దయనీయ స్థితికి దిగజారిన శ్రీలంకకు అన్ని విధాలుగా సాయం అందిస్తామని అన్నారు. ఆర్థికంగా తోడ్పాటు అందించడమే కాకుండా, ఇంధనం, ఆహారం, ఔషధాలు, ఇతర నిత్యావసరాలు అందిస్తామని తెలిపారు. 

తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధాని మోదీ పర్యటించడం ఇదే తొలిసారి. మోదీ రాక నేపథ్యంలో, చెన్నైలో 20 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మోదీ చెన్నై చేరుకున్న అనంతరం భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు బీజేపీ శ్రేణులు భారీగా తరలి వచ్చాయి. రోడ్డుకు ఇరువైపులా బీజేపీ శ్రేణులు, మద్దతుదారులు మోదీకి అభివాదం చేస్తూ కనిపించారు.

  • Loading...

More Telugu News