Enforcement Directorate: ఈ నెల 31న విచారణకు రండి... జమ్మూకశ్మీర్ మాజీ సీఎంకు ఈడీ నోటీసులు
- ఫరూఖ్ అబ్దుల్లాకు ఈడీ నోటీసులు
- కేసు వివరాలు చెప్పకుండానే విచారణకు పిలుపు
- జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాల కేసుగా అనుమానం
జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 31న తమ ముందు విచారణకు హాజరుకావాలంటూ ఈడీ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే ఏ కేసు విచారణకు ఆయనను పిలుస్తున్నారన్న విషయాన్ని ఈడీ అధికారులు వెల్లడించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌లో చోటుచేసుకున్న అక్రమాలకు సంబంధించిన కేసులో ఆయనను ఈడీ అధికారులు విచారణకు పిలిచినట్లుగా భావిస్తున్నారు.