Nancy Crampton Brophy: 'మీ భర్తను చంపడం ఎలా?' అనే వ్యాసం రాసిన రచయిత్రి తన భర్తనే చంపేసింది!

How to murder your husband article writer killed her husband

  • అమెరికాలో ఘటన
  • గతంలో కొన్ని పుస్తకాలు రాసిన నాన్సీ
  • నాన్సీ భర్త డేనియల్ ఓ చెఫ్
  • తాను పనిచేసే ఇన్ స్టిట్యూట్ లోనే హత్యకు గురైన వైనం
  • వెనుక నుంచి కాల్చిన నాన్సీ

ఆమె పేరు నాన్సీ క్రాంప్టన్ బ్రోఫీ. అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రం పోర్ట్ లాండ్ లో నివసిస్తుంటుంది. నాన్సీ ఓ రచయిత్రి. 'మీ భర్తను చంపడం ఎలా?' అనే వ్యాసంతో పాటు పలు నవలలు కూడా రాసింది. అనూహ్యరీతిలో ఆమె తన భర్తనే చంపేసింది. నాన్సీ భర్త డేనియల్ బ్రోఫీ ఓ చెఫ్. ఓరెగాన్ కలినరీ ఇన్ స్టిట్యూట్ లో కుకింగ్ పాఠాలు బోధిస్తుంటాడు. అయితే తన ఇన్ స్టిట్యూట్ లోనే ఓ కిచెన్ లో డేనియల్ ప్రాణాలు కోల్పోయాడు. 

నాన్సీ తుపాకీతో వెనుక నుంచి రెండు రౌండ్లు కాల్చడంతో అతగాడు కుప్పకూలిపోయాడు. రెండు బుల్లెట్లు గుండెకు తాకడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతడి విద్యార్థులు, సహచరులు వచ్చి చూడడంతో రక్తపుమడుగులో పడి ఉన్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోర్ట్ లాండ్ పోలీసులు రచయిత్రి నాన్సీని అరెస్ట్ చేశారు. విచారణ జరగ్గా, ఆమెను దోషిగా నిర్ధారించారు. 

విచారణ సంరద్భంగా... గతంలో భర్త డేనియల్ తో కలిసి ఓ గన్ షోను సందర్శించిన సమయంలో గ్లాక్ పిస్టల్ ను కొనుగోలు చేసినట్టు నాన్సీ వెల్లడించింది. పోలీసులను విస్మయానికి గురిచేసిన అంశం ఏమిటంటే... ఆ గ్లాక్ పిస్టల్ ను స్వాధీనం చేసుకోగా, దాన్ని ఎవరూ ఉపయోగించిన దాఖలాలు కనిపించలేదు. మరి, నాన్సీ తన భర్తను ఏ తుపాకీతో కాల్చిందని పోలీసులకు సందేహాలు వచ్చాయి. విచారణలో నాన్సీని ప్రశ్నించగా, ఆసక్తికర సమాధానం వెలువడింది.

ఓ ఆన్ లైన్ వెబ్ సైట్ నుంచి పిస్టల్ పైన ఉండే స్లైడ్ ను, బ్యారెల్ (గొట్టం)ను కొనుగోలు చేసినట్టు తెలిపింది. తమ గ్లాక్ పిస్టల్ కున్న స్లైడ్, బ్యారెల్ విప్పి, తాను ఆన్ లైన్ లో కొనుగోలు చేసిన స్పేర్ పార్టులను ఆ తుపాకీకి అమర్చింది. పిస్టల్ తో పాటు వచ్చిన బుల్లెట్లు కాకుండా, వేరే బుల్లెట్లు వినియోగించింది. భర్తను కాల్చిన అనంతరం, ఆ స్పేర్ పార్టులను విప్పదీసి, మళ్లీ ఒరిజినల్ పార్టులు బిగించి, తుపాకీని యథాస్థానంలో ఉంచింది. 

ఈ కారణంగానే, గ్లాక్ పిస్టల్ తో ఎలాంటి కాల్పులు జరగలేదని పోలీసులు తొలుత భావించారు. కానీ విచారణలో నాన్సీ చెప్పింది విన్నాక వారికి మతిపోయింది. త్వరలోనే ఈ కిల్లర్ రచయిత్రికి శిక్ష ఖరారయ్యే అవశాలు ఉన్నాయి. నాన్సీ గతంలో 'రాంగ్ హజ్బెండ్', 'హెల్ ఆన్ ఏ హార్ట్' అనే పుస్తకాలు రాసింది. అయితే, ఆ రెండు నవలు ఆర్థికంగా దెబ్బకొట్టాయి.

  • Loading...

More Telugu News