Daggubati Purandeswari: వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ.. రిజర్వుబ్యాంకుతో మాట్లాడుతున్నామన్న పురందేశ్వరి

want to print NTR Photo on Rs 100 Coin Says Purandeswari
  • ఎన్టీఆర్ ఘాట్ వద్ద తండ్రికి నివాళి అర్పించిన పురందేశ్వరి
  • తెలుగు రాష్ట్రాల్లోని 12 కేంద్రాల్లో ఉత్సవాలు నిర్వహిస్తామన్న ఎన్టీఆర్ తనయ
  • ఉత్సవాల నిర్వహణకు బాలకృష్ణ, రాఘవేంద్రరావులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్టు వెల్లడి
వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ బొమ్మను ముద్రించే విషయమై భారతీయ రిజర్వు బ్యాంకుతో చర్చలు జరుపుతున్నట్టు ఆయన కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని ఈ ఉదయం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించి నివాళులు అర్పించిన పురందేశ్వరి అనంతరం మాట్లాడుతూ.. నేటి నుంచి వచ్చే ఏడాది మే 28వ తేదీ వరకు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. 

ఉత్సవాల నిర్వహణ కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 12 కేంద్రాలను గుర్తించినట్టు తెలిపారు. వాటిలోనే ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణను పర్యవేక్షించేందుకు కమిటీని కూడా ఏర్పాటు చేశామని, అందులో బాలకృష్ణ, రాఘవేంద్రరావు వంటి ప్రముఖులు కూడా ఉన్నట్టు చెప్పారు. ఈ వేడుకల సందర్భంగా అన్ని రంగాల్లో నిపుణులైన వారిని సత్కరించనున్నట్టు పురందేశ్వరి తెలిపారు.
Daggubati Purandeswari
NTR
NTR Birth Anniversary
NTR Ghat
RBI
Rs 100 Coin

More Telugu News