COVID19: దేశంలో కరోనా డైలీ కేసులు ఎన్నంటే..!

2685 new covid cases recorded in past 24 hours

  • మహమ్మారి బారిన మరో 2,685 మంది
  • కరోనాతో మరో 33 మంది మృతి
  • యాక్టివ్ కేసుల్లో 494 పెరుగుదల

దేశంలో కొత్తగా 2,685 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న నమోదైన తాజా కేసులతో దేశంలో మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 4,31,50,215కి పెరిగింది. మరో 33 మంది చనిపోగా.. మృతుల సంఖ్య 5,24,572కి చేరింది. యాక్టివ్ కేసులు 16,308కి పెరిగాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే యాక్టివ్ కేసులు 494 పెరిగాయి. 

మరోవైపు దేశంలో నిన్న 2,158 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. ఆ మొత్తం సంఖ్య 4,26,09,335కి చేరింది. రికవరీ రేటు 98.75 శాతంగా నమోదైంది. డైలీ పాజిటివిటీ రేటు 0.6 శాతంగా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 0.54 శాతంగా నమోదైంది. మొత్తంగా 193,13,41,918 డోసుల కరోనా వ్యాక్సిన్లను వినియోగించారు. నిన్న ఒక్కరోజే 14,39,466 డోసులు వ్యాక్సిన్ ను ప్రజలకు ఇచ్చారు.

  • Loading...

More Telugu News