Chinta Mohan: కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని ఖండిస్తున్నా: కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్
- అంబేద్కర్ ఒక మహోన్నతమైన వ్యక్తి అన్న చింతా మోహన్
- ఆయన ఒక జిల్లాకు పరిమితమైన వ్యక్తి కాదని వ్యాఖ్య
- సామాజిక న్యాయం పేరుతో అన్యాయాలకు పాల్పడుతున్నారని విమర్శ
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ను ఏపీ ప్రభుత్వం అవమానిస్తోందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం దిగజారి ప్రవర్తిస్తోందని అన్నారు. అంబేద్కర్ ఒక మహోన్నతమైన వ్యక్తి అని, ప్రపంచ మేధావి అని, ఆయన ఒక జిల్లాకు పరిమితమైన వ్యక్తి కాదని చెప్పారు. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని ఖండిస్తున్నానని తెలిపారు. ఆ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్రేనని చెప్పారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీల స్కాలర్ షిప్ లు పూర్తిగా తీసేయడం సామాజిక అన్యాయమని దుయ్యబట్టారు. ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చే దానికి నీ దీవెన పేరు ఏమిటని సీఎం జగన్ పై మండిపడ్డారు. నీవు చదివింది ఏంది? నీవు దీవించేది ఏంది? దీవించేందుకు నీకున్న అర్హత ఏందని ప్రశ్నించారు.