Zircon: తిరుగులేని హైపర్ సోనిక్ క్షిపణిని పరీక్షించిన రష్యా

Russia successfully test fires Zircon missile

  • జిర్కాన్ హైపర్ సోనిక్ ప్రయోగం విజయవంతం
  • బేరెంట్స్ సముద్రంలో అడ్మిరల్ గోర్షకోవ్ నౌక నుంచి ప్రయోగం
  • వైట్ సీలోని లక్ష్యాన్ని ఛేదించిన జిక్రాన్
  • ప్రకటన చేసిన రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ

ఉక్రెయిన్ పై దాడుల్లో తీవ్రత పెంచిన రష్యా తన అమ్ములపొది నుంచి ఒక్కొక్క అస్త్రాన్నే బయటికి తీస్తోంది. తాజాగా, ఉక్రెయిన్ ను భయపెట్టేందుకు జిర్కాన్ హైపర్ సోనిక్ మిస్సైల్ ను ప్రయోగాత్మకంగా పరీక్షించింది. బేరెంట్స్ సముద్రంలో మోహరించిన అడ్మిరల్ గోర్షకోవ్ యుద్ధ నౌక నుంచి ఈ తిరుగులేని క్షిపణిని ప్రయోగించగా, వైట్ సీ ప్రాంతంలోని లక్ష్యాన్ని గురితప్పకుండా ఛేదించినట్టు వెల్లడైంది. 

లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో జిర్కాన్ హైపర్ సోనిక్ క్షిపణి 1000 కిమీ ప్రయాణించినట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రయోగం విజయవంతమైందని ప్రకటించింది. కొత్త ఆయుధాల పనితీరును పరీక్షించడంలో భాగంగానే ఈ ప్రయోగం జరిపినట్టు పేర్కొంది. 

జిర్కాన్ మిస్సైల్ ధ్వని వేగం కంటే ఐదు రెట్ల అధికవేగంతో ప్రయాణిస్తుంది. దీని రేంజి 1000 కిలోమీటర్లు. ఇప్పటికే ఉక్రెయిన్ పై దాడుల్లో కింజాల్, డాగర్ మిస్సైళ్లను ప్రయోగించిన రష్యా... త్వరలోనే జిర్కాన్ హైపర్ సోనిక్ అస్త్రాన్ని కూడా ప్రయోగించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ అధునాతన క్షిపణిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తిరుగులేని అస్త్రంగా అభివర్ణిస్తున్నారు. 

దీన్ని పుతిన్ 2018లో ఆవిష్కరించారు. దీన్ని రాడార్లపై గుర్తించడం దాదాపు అసాధ్యం అని చెప్పాలి. క్షిపణి విధ్వంసక వ్యవస్థలతో దీన్ని అడ్డుకోవడం ఎంతో కష్టసాధ్యం. అంతేకాదు, జిర్కాన్ మిస్సైల్ కు తక్కువ ఎత్తులో ప్రయాణించే సామర్థ్యం ఉండడంతో ఇది రాడార్లను ఏమార్చగలదు.

  • Loading...

More Telugu News