Nayanthara: మహాబలిపురంలో నయనతార, విఘ్నేశ్ వివాహ వేడుక?

Nayanthara and Vignesh Shivan to get married in Mahabalipuram
  • జూన్ 9న పెళ్లి ముహూర్తం  
  • లీకైన డిజిటల్ ఇన్విటేషన్ 
  • సామాజిక మాధ్యమాల్లో సందడి
తమిళ అగ్ర నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ వివాహం తిరుపతిలో కాదని తేలిపోయింది. వీరి వివాహ వేడుక ఆహ్వాన పత్రికలోని సమాచారం లీక్ అయింది. ఈ జంట జూన్ 9న వివాహం చేసుకోనున్నట్టు తాజా సమాచారం. తమిళనాడులోని మహాబలిపురంలో వివాహ వేడుక జరగనుంది. ఇందుకు సంబంధించిన డిజిటల్ ఆహ్వానం ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.

ఈ జంట గత ఏడేళ్లుగా సహజీవనం చేస్తోంది. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ వివాహ వేడుక చూసిన వెడ్డింగ్ ప్లానర్ కు నయన్, విఘ్నేశ్ వివాహ ఏర్పాట్ల బాధ్యతలను అప్పగించినట్టు తెలుస్తోంది. ‘నయన్ వెడ్స్ విక్కీ.. 9, జూన్ 2022. డేట్ సేవ్ చేసుకోండి. మహబ్స్’ అంటూ డిజిటల్ వెడ్డింగ్ ఇన్విటేషన్ లో సమాచారం ఉంది. నయనతార ప్రభుదేవాకు దూరమయ్యాక.. 2015లో నానుమ్ రౌడీ దాన్ సినిమా సందర్భంగా విఘ్నేశ్, నయన మధ్య ప్రేమ చిగురించింది. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య వీరి వివాహం జరగనుంది. 


Nayanthara
Vignesh Shivan
wedding
Mahabalipuram

More Telugu News