Ram Gopal Varma: మోదీ, అమిత్ షాల పాత ఫొటో పంచుకున్న రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma shares an old pic of Modi and Amit Shah
  • సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వర్మ
  • వర్మ పంచుకున్న ఫొటోకు విశేష స్పందన
  • ఓ విగ్రహం వద్ద నిల్చున్న మోదీ, అమిత్ షా
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన చిత్రాల ప్రమోషన్లతోనే కాకుండా, ఇతర అంశాలపైనా స్పందిస్తూ సోషల్ మీడియాలో బిజీగా ఉంటారు. తాజాగా వర్మ సోషల్ మీడియాలో పంచుకున్న ఫొటోకు విపరీతమైన స్పందన వస్తోంది. ఆ ఫొటోలో ఉన్నది ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అయితే ఆ ఫొటో ఇప్పటిది కాదు. 1993 నాటి ఫొటో కాగా, జర్కిన్లు ధరించిన వారిద్దరూ ఓ విగ్రహం వద్ద నిల్చున్న దృశ్యం ఫొటోలో చూడొచ్చు. కాగా, ఈ ఫొటోకు వర్మ ఎలాంటి క్యాప్షన్ పెట్టలేదు.
Ram Gopal Varma
Narendra Modi
Amit Shah
Pic
Social Media

More Telugu News