iQOO Neo 6: ఆకర్షణీయమైన డిజైన్ తో ఐక్యూ నియో 6 విడుదల
- రెండు రకాల వేరియంట్లలో లభ్యం
- రూ.29,999 నుంచి ధరలు ప్రారంభం
- అమెజాన్ వేదికపై నేటి నుంచే విక్రయాలు
చైనాకు చెందిన ఐక్యూ బ్రాండ్ భారత మార్కెట్లోకి నియో 6 స్మార్ట్ ఫోన్ ను మంగళవారం విడుదల చేసింది. నియో సిరీస్ లో వచ్చిన మొదటి ఫోన్ ఇది. పవర్ ఫుల్ ప్రాసెసర్, మెరుగైన ఫీచర్లతో, గేమర్లను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్ ను రూపొందించారు.
ఫీచర్లు
స్నాప్ డ్రాగన్ 870 5జీ ప్రాసెసర్ వాడారు. 6.62 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే ఇందులో ఉంటుంది. వెనుక భాగంలో శామ్ సంగ్ జీడ్ల్యూ 1పి 48 మెగా పిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు. అలాగే, 8 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సల్ మైక్రో సెన్సార్ వుంటాయి. ముందు భాగంలో సెల్ఫీల కోసం 16 మెగాపిక్సల్ కెమెరా అమర్చారు. 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ తో ఉంటుంది.
ధరలు
8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ ధర రూ.29,999. 12జీబీ, 256 జీబీ ధర రూ.33,999. నేటి నుంచే (మే 31) అమెజాన్ లో విక్రయాలు మొదలయ్యాయి. డార్క్ నోవా, సైబర్ రేంజ్ రంగుల్లో ఈ ఫోన్లు లభిస్తాయి. రెండేళ్లపాటు ఆండ్రాయిడ్ వెర్షన్లు, మూడేళ్లపాటు సెక్యూరిటీ అప్ డేట్స్ కు సంస్థ హామీ ఇస్తోంది.