KK: వెంటనే సీపీఆర్ చేసుంటే గాయకుడు కేకే బతికేవాడంటున్న డాక్టర్

Doctor says if CPR done in time KK could have been survived

  • ప్రముఖ గాయకుడు కేకే హఠాన్మరణం
  • కోల్ కతాలో పోస్టుమార్టం పూర్తి
  • గుండె సంబంధ సమస్యలు ఉన్నాయన్న డాక్టర్
  • ఎడమ ధమనిలో పెద్ద బ్లాక్ ఉందని వెల్లడి

ప్రముఖ గాయకుడు కేకే (కృష్ణకుమార్ కున్నథ్) కోల్ కతాలో ఓ సంగీత కచేరీ అనంతరం హఠాన్మరణం చెందడం తెలిసిందే. అస్వస్థతకు గురైన కేకేను కోల్ కతాలోని సీఎంఆర్ఐ ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆయన అప్పటికే మరణించినట్టు డాక్టర్లు తెలిపారు. కాగా, కేకే భౌతికకాయానికి పోస్టుమార్టం పూర్తయింది. 

అనంతరం ఓ వైద్యుడు స్పందిస్తూ, అస్వస్థతకు గురైన వెంటనే సీపీఆర్ చేసుంటే కేకే బతికుండేవాడని అభిప్రాయపడ్డారు. కేకే చాలాకాలంగా హృదయ సంబంధ సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోందని పేర్కొన్నారు. కేకే గుండెకు దారితీసే నాళాల్లో అనేక అడ్డంకులు (హార్ట్ బ్లాకేజస్) గుర్తించామని వెల్లడించారు. ముఖ్యంగా ఎడమ ప్రధాన ధమనిలో పెద్ద అడ్డంకి (80 శాతం) ఉందని, ఇతర నాళాల్లోనూ చిన్న చిన్న అడ్డంకులు గుర్తించామని తెలిపారు.

సంగీత కచేరీలో పాడడం, డ్యాన్స్ చేయడం ద్వారా కేకే తీవ్ర ఉద్విగ్నతకు గురై ఉంటాడని, దాంతో రక్తప్రసరణ నిలిచిపోయి కార్డియాక్ అరెస్ట్ సంభవించిందని, అదే కేకే మరణానికి దారితీసిందని ఆ వైద్యుడు వివరించారు. కేకే అపస్మారక స్థితిలోకి వెళ్లిన వెంటనే సీపీఆర్ చేసి ఉన్నట్టయితే అతడి ప్రాణాలు కాపాడే అవకాశం ఉండేదని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News