Kalash Gupta: కోడింగ్ లో అంతర్జాతీయస్థాయిలో మేటిగా నిలిచిన ఢిల్లీ ఐఐటీ విద్యార్థి

IIT Delhi student Kalash Gupta wins coding competition

  • కోడింగ్ పోటీ నిర్వహించిన టీసీఎస్
  • పోటీలో 87 దేశాల నుంచి లక్ష మంది నిపుణులు 
  • నెంబర్ వన్ గా నిలిచిన కలశ్ గుప్తా
  • రూ.7.76 లక్షల ప్రైజ్ మనీ కైవసం

టెక్ అంశాల్లో భారతీయుల ప్రతిభకు అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు ఉంది. ఈ కారణంగానే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో భారత ఐటీ నిపుణులకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఇక అసలు విషయానికొస్తే... ఢిల్లీ ఐఐటీ విద్యార్థి కలశ్ గుప్తా కోడింగ్ రంగంలో అంతర్జాతీయస్థాయిలో సత్తా చాటాడు. కలశ్ గుప్తా ఢిల్లీ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ మూడో సంవత్సరం విద్యార్థి. టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) ప్రతి ఏడాది నిర్వహించే కోడ్ విటా గ్లోబల్ ప్రోగ్రామింగ్ కాంపిటీషన్ సీజన్-10లో కలశ్ గుప్తా కూడా పాల్గొన్నాడు. 

ఈ పోటీలో 87 దేశాలకు చెందిన దాదాపు లక్ష మంది కోడింగ్ నిపుణులు పాల్గొన్నారు. అయితే, కలశ్ తన కోడింగ్ నైపుణ్యంతో ఈ కాంపిటీషన్ లో విజేతగా నిలిచాడు. తద్వారా రూ.7.76 లక్షల నగదు బహుమతి, 'వరల్డ్ బెస్ట్ కోడర్' టైటిల్ కైవసం చేసుకున్నాడు. టీసీఎస్ నిర్వహించే ఈ కోడింగ్ కాంపిటీషన్ ప్రపంచంలోనే అతిపెద్ద కోడింగ్ ఈవెంట్ అని గిన్నిస్ బుక్ ఆఫర్ రికార్డ్స్ పేర్కొంది.

  • Loading...

More Telugu News