YSRCP: త‌న‌పై న‌మోదైన కేసుల చిట్టాను ప‌బ్లిక్ డొమైన్‌లో పెట్టిన‌ విజ‌య‌సాయిరెడ్డి

vijay sai reddy published cases filed on himin public domain
  • వ‌రుస‌గా రెండో సారి రాజ్య‌స‌భ‌కు సాయిరెడ్డి ఎన్నిక‌
  • నామినేష‌న్ ప‌త్రాల్లో కేసుల వివ‌రాలు జ‌త చేసిన వైనం
  • అదే వివ‌రాల‌ను ప‌బ్లిక్ డొమైన్‌లో విడుద‌ల చేసిన ఎంపీ
వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి వ‌రుస‌గా రెండోసారి రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఎన్నికైన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో సాయిరెడ్డి శ‌నివారం ఓ కీల‌క అడుగు వేశారు. త‌న‌పై న‌మోదైన అన్ని ర‌కాల కేసుల చిట్టాను ఆయ‌న ప‌బ్లిక్ డొమైన్‌లో పెట్టారు. 

వాస్త‌వానికి రాజ్య‌స‌భ అభ్య‌ర్థిగా నామినేష‌న్ వేసే స‌మ‌యంలో త‌న‌కున్న అప్పులు, ఆస్తుల‌తో పాటు కేసుల వివ‌రాల‌ను కూడా వెల్ల‌డించాల్సిందే. ఇదే రీతిన సాయిరెడ్డి కూడా త‌న నామినేష‌న్ ప‌త్రాల్లో ఈ జాబితాను కూడా జ‌త చేశారు. తాజాగా అదే జాబితాను ఆయ‌న ప‌బ్లిక్ డొమైన్‌లో విడుద‌ల చేశారు.
YSRCP
Rajya Sabha
Vijay Sai Reddy

More Telugu News