Cricket: టీ20 వరల్డ్ కప్ క్వాలిఫయర్: 8 పరుగులకే ఆలౌట్.. ఆ జట్టు నడ్డి విరిచిన భారత సంతతి బౌలర్!

Nepal All Out For 8 in t20 world cup qualifier

  • నేపాల్ పరమ చెత్త రికార్డు
  • యూఏఈ చేతిలో ఘోర పరాభవం
  • అండర్ 19 మహిళల మ్యాచ్ లో చెత్త రికార్డు
  • 4 ఓవర్లు.. 2 మెయిడెన్లు.. 5 వికెట్లతో మహికా గౌర్ సంచలనం 

టీ20 క్రికెట్ లో అత్యంత చెత్త రికార్డు నమోదైంది. ఎవరూ.. ఏ జట్టూ కోరుకోని పరమ హీనమైన రికార్డు వచ్చి చేరింది. అండర్ 19 మహిళల టీ20 వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్ లో నేపాల్ జట్టు ఈ చెత్త రికార్డును మూటగట్టుకుంది. శనివారం యూఏఈతో మలేషియాలోని బంగీలో జరిగిన మ్యాచ్ లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు 8.1 ఓవర్లు ఆడి 8 పరుగులకే కుప్ప కూలింది. కేవలం ఐదుగురు బ్యాటర్లే పరుగుల ఖాతా తెరవడం విశేషం. మిగతా వారంతా సున్నా పరుగులకే పెవిలియన్ కు క్యూ కట్టారు. 

10 బంతుల్లో 3 పరుగులు చేసిన స్నేహ మహరానే నేపాల్ తరఫున టాప్ స్కోరర్. యూఏఈ తరఫున ఆడిన భారత మూలాలున్న మహికా గౌర్ నేపాల్ నడ్డి విరిచింది. 4 ఓవర్లు బౌలింగ్ చేసిన ఆమె.. 2 మెయిడెన్లు వేసి కేవలం 2 పరుగులే ఇచ్చి 5 వికెట్లు కూల్చింది. మరో బౌలర్ ఇందూ నందకుమార్  ఆరు పరుగులిచ్చి మూడు వికెట్లు తీసింది. 

ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన యూఏఈ కేవలం 7 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. 4 పరుగులు చేసిన భారత సంతతికి చెందిన తీర్థా సతీశ్ మ్యాచ్ లోనే టాప్ స్కోరర్. మొత్తంగా ఈ మ్యాచ్ 9 ఓవర్లలోనే ముగియడం గమనార్హం.

  • Loading...

More Telugu News