WhatsApp: వాట్సాప్ పై మరో కొత్త ఫీచర్
- అన్ డూ ఆప్షన్ అభివృద్ధి
- డిలీట్ చేసిన సందేశాలను రిట్రీవ్ చేసుకోవచ్చు
- పొరపాటుగా డిలీట్ చేసినట్టయితే బెనిఫిట్
వాట్సాప్ ఎప్పటికప్పుడు పరిశోధన ద్వారా కొత్త ఫీచర్లను జోడిస్తోంది. తాజాగా ఈ సంస్థ ‘అన్ డూ’ ఆప్షన్ పై పనిచేస్తోంది. మనం ఎవరో ఒకరికి మెస్సేజ్ చేసిన తర్వాత వాటిని వద్దనుకుంటే డిలీట్ చేసే ఆప్షన్ ఉంది. ఒక అరగంటలోపు వీటిని డిలీట్ కొట్టేయవచ్చు. గ్రూపులో పెట్టిన మెస్సేజ్ లో ఏదైనా తప్పును గుర్తిస్తే వెంటనే డిలీట్ చేసుకోవచ్చు. వాట్సాప్ లో డిలీట్ ఫీచర్ కు సంబంధించి ఎన్నో ప్రశంసలు లభించాయి.