Samantha Ruth Prabhu: మంచి ఆఫర్ కొట్టేసిన సమంత.. రణవీర్ సింగ్ తో ప్రాజెక్ట్

Samantha Ruth Prabhu teases first project with sweetest ever Ranveer Singh
  • ఇన్ స్టా గ్రామ్ లో ఫొటో షేర్ చేసిన సమంత
  • ఎయిర్ ఫోర్స్ డ్రెస్ తో, సన్ గ్లాసెస్ తో కనిపించిన అమ్మడు
  • బ్లూషర్ట్ తో ఉన్న రణవీర్ సింగ్
సమంత వివాహ బంధం నుంచి వేరుపడి ఒంటరి అయ్యాక కెరీర్ పై ఫోకస్ బాగా పెంచింది. తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ ప్రాజెక్టులో నటించబోతోంది. అది కూడా ప్రముఖ నటుడు రణవీర్ సింగ్ సరసన తొలిసారి నటించనుంది. వీరిద్దరూ కలసి ఉన్న ఫొటోను సమంత షేర్ చేసింది. ఈ ఫొటోలో రణవీర్ సింగ్ బ్లూ షర్ట్ తో ఉండగా, సమంత ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్ తో కనిపిస్తోంది. అంటే ఆమె ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాత్రలో కనపించనుందని తెలుస్తోంది. తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ఆమె ఈ ఫొటోను షేర్ చేసింది. 

సమంత చేతిలో సన్ గ్లాసెస్ కూడా ఉన్నాయి. ‘సమ్ థింగ్ బ్యూటీఫుల్ ఈజ్ ఆన్ ద హొరైజన్’ అని సమంత క్యాప్షన్ తగిలించింది. అంటే ఈ సినిమా విశేషాలను అతి త్వరలో ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. సమంత స్టెప్పులతో బాగా ప్రాచుర్యం పొందిన 'ఊ అంటావా మావ' పాట తనకిష్టమైనదిగా లోగడ రణవీర్ సింగ్ చెప్పడం తెలిసిందే. ‘‘పాటలో ఏముందో నాకు అర్థం తెలియదు. కానీ, మ్యూజిక్ మాత్రం నా హృదయాన్ని తాకింది’’ అని రణవీర్ చెప్పాడు. 

ఇటీవల సమంత పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవలే వచ్చిన ‘కాతు వాకుల రెండు కాదల్’ సినిమాలో కనిపించింది. విజయ్ దేవరకొండతో కలసి ‘ఖుషి’ సినిమా షూటింగ్ లో పాల్గొని ఇటీవలే కశ్మీర్ నుంచి తిరిగొచ్చింది. శాకుంతలం, యశోద సినిమాలు సైతం సమంత ఖాతాలో ఉన్నాయి.
Samantha Ruth Prabhu
Ranveer Singh
new project

More Telugu News