ITBP: హిమాలయాలపై యోగా.. ఐటీబీపీ జవాన్ల సాహసం
- 22,850 అడుగుల ఎత్తులో యోగాసనాలు
- వీడియో షేర్ చేసిన ఐటీబీపీ
- రెండో అత్యంత ఎత్తయిన ప్రాంతం అది
ఇంటో టిబెటన్ బోర్డర్ పోలీసు (ఐటీబీపీ) జవాన్లు రికార్డు సృష్టించారు. అత్యంత ఎత్తయిన ప్రదేశంలో యోగా సాధన చేసి రికార్డు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐటీబీపీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.
పర్వతారోహకులతో కూడిన ఈ జవాన్ల బృందం ఉత్తరాఖండ్ రాష్ట్రం, మౌంట్ అబీగమిన్ సమీపంలో 22,850 అడుగుల ఎత్తులో, మంచుతో కూడిన ప్రదేశంలో యోగాసనాలు వేశారు. ఏటా జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటారు. దీనికంటే ముందు జవాన్లు యోగాసనంతో రికార్డు నమోదు చేయడం విశేషం.
అంతకుముందు ఇదే బృందం 24,131 అడుగుల ఎత్తులో ఉన్న మౌంట్ అబీ గమిన్ ను అధిరోహించారు. ఇది హిమాలయ పర్వతాల్లో మధ్య భాగంలో ఉంది. సదరు ప్రాంతంలో ఇది రెండో అత్యంత ఎత్తయిన శిఖరం.