IRCTC: ఐఆర్‌సీటీసీ డ‌బుల్ ధ‌మాకా!... రైల్వే టికెట్ల బుకింగ్ ప‌రిమితి పెంపు!

irctc doubles ticket booking limit

  • ఆధార్‌తో అనుసంధానం లేని యూజ‌ర్ ఐడీకి నెల‌లో 6 టికెట్లే పరిమితం
  • ఇక‌పై ఈ సంఖ్య 12కు పెంపు
  • ఆధార్ అనుసంధాన‌మైన యూజర్ ఐడీకి ప్ర‌స్తుతం నెల‌లో 12 టికెట్లు
  • ఇక‌పై వీటి సంఖ్య‌ను 24కు పెంచుతూ ఐఆర్‌సీటీసీ నిర్ణ‌యం

భార‌తీయ రైల్వేలో టికెట్ల బుకింగ్ ప‌రిమితికి సంబంధించి సోమ‌వారం ఓ గుడ్ న్యూస్ విడుద‌లైంది. ఇప్ప‌టిదాకా ఉన్న టికెట్ల బుకింగ్ ప‌రిమితిని డ‌బుల్ చేస్తూ ఇండియ‌న్ రైల్వే కేట‌రింగ్ అండ్ టూరిజం కార్పొరేష‌న్ (ఐఆర్‌సీటీసీ) సోమ‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న టికెట్ల బుకింగ్ ప‌రిమితిని ఇక‌పై రెండింత‌ల‌కు పెంచుతున్న‌ట్లు ఆ సంస్థ ప్ర‌క‌టించింది.

ఐఆర్‌సీటీసీ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఒక నెల‌లో ఆధార్ అనుసంధానం చేయ‌ని యూజ‌ర్ ఐడీ ద్వారా నెల‌లో 6 టికెట్ల‌ను మాత్ర‌మే బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే దీనిని 12కు పెంచుతున్న‌ట్లు ఆ సంస్థ వెల్ల‌డించింది. అదే స‌మయంలో ఆధార్ అనుసంధానం చేసిన యూజ‌ర్ ఐడీతో ప్ర‌స్తుతం నెల‌కు 12 టికెట్ల‌ను మాత్ర‌మే బుక్ చేసుకునే అవ‌కాశం ఉంది. దీనిని కూడా రెట్టింపు చేస్తూ ఇక‌పై నెల‌లో ఈ యూజ‌ర్లు 24 టికెట్ల‌ను బుక్ చేసుకునే అవ‌కాశాన్ని కల్పించింది.

  • Loading...

More Telugu News