TKS Elangovan: హిందీ వెనుకబడిన రాష్ట్రాల వారు మాట్లాడే భాష: డీఎంకే ఎంపీ ఇళంగోవన్ వివాదాస్పద వ్యాఖ్యలు
- మరోసారి తెరపైకి హిందీ వివాదం
- తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎంపీ
- హిందీ శూద్రుల్లా మార్చివేస్తుందని వెల్లడి
తమిళులకు, హిందీకి పెద్దగా పొసగదనేందుకు అనేక దృష్టాంతాలు ఉన్నాయి. తాజాగా డీఎంకే ఎంపీ టీకేఎస్ ఇళంగోవన్ చేసిన వ్యాఖ్యలు ఈ కోవలోకే వస్తాయి. హిందీ వెనుకబడిన రాష్ట్రాల భాష అని ఇళంగోవన్ పేర్కొన్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లోనే మాట్లాడతారని వెల్లడించారు.
"పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలను చూడండి... ఇవన్నీ అభివృద్ధి చెందిన రాష్ట్రాలు కాదా? ఈ రాష్ట్రాల ప్రజలకు హిందీ మాతృభాష కాదు" అని వివరించారు.
అంతేగాదు, హిందీ మనల్ని శూద్రుల్లా మార్చేస్తుంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిందీని స్వీకరించడం ఎవరికీ మంచిదికాదని అన్నారు.