Nayanthara: నయన్, విఘ్నేశ్ పెళ్లి వేడుకకు గౌతమ్ మీనన్ దర్శకత్వం!

Gautham Menon to direct Nayanthara and Vignesh Shivan wedding ceremony
  • డాక్యుమెంటరీగా పెళ్లి వేడుక 
  • ఓటీటీ ప్లాట్ ఫామ్ పై విడుదల
  • ఇప్పటికే ప్రివ్యూ షూటింగ్ పూర్తి
  • పెళ్లికి విచ్చేయనున్న హేమాహేమీలు
విఘ్నేశ్ శివన్, నయనతార వివాహ వేడుక ఈ నెల 9న చెన్నై సమీపంలోని మహాబలిపురంలో జరగనుంది. ఈ వేడుకను గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చిత్రీకరించనున్నట్టు సమాచారం బయటకు వచ్చింది. వివాహానికి ముందుగా ప్రివ్యూ షూటింగ్ ఆదివారం జరిగింది. వివాహ దృశ్యాలతో వెడ్డింగ్ డాక్యుమెంటరీని గౌతమ్ మీనన్ రూపొందించనున్నారు. అనంతరం దీన్ని నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం చేస్తారని సమాచారం. 

మరి నయనతార, విఘ్నేశ్ పెళ్లి వేడుక ప్రసార హక్కులను ఇప్పటికే నెట్ ప్లిక్స్ కు విక్రయించేశారా..? అన్నది స్పష్టం కాలేదు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, అగ్ర నటులు రజనీకాంత్, కమలహాసన్, చిరంజీవి, సూర్య, అజిత్, కార్తీ, విజయ్ సేతుపతి సహా సెలబ్రిటీలు చాలా మంది హాజరు అవుతారని భావిస్తున్నారు. 

వివాహ వేడుకను చిత్రీకరించి, అనంతరం దాన్నొక డాక్యుమెంటరీగా రూపొందించిన తర్వాత ఓటీటీ ప్లాట్ ఫామ్ పై విడుదల చేస్తారని తెలుస్తోంది. పెళ్లి డాక్యుమెంటరీ ప్రసార హక్కులను విక్రయించడం ద్వారా వారికి పెద్ద మొత్తంలో సమకూరే అవకాశం ఉంది. 

Nayanthara
Vignesh Shivan
wedding
Gautham Menon
documentary
OTT

More Telugu News