Renuka Chowdary: రఘునందన్ పై కేసు నమోదు చేయడంలో తప్పు లేదు: రేణుకా చౌదరి
- తెలంగాణలో అత్యాచారాలు పెరిగిపోయాయన్న రేణుక
- ఒక్కరోజే ముగ్గురు మైనర్లపై అత్యాచారాలు జరిగాయని విమర్శ
- బాధితురాలి వివరాలను రఘునందన్ రావు వెల్లడించడం నేరమేనని వ్యాఖ్య
తెలంగాణలో అత్యాచారాలు పెరిగిపోయాయని కాంగ్రెస్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి మండిపడ్డారు. పసిపిల్లకు కూడా రక్షణ లేకుండా పోయిందని అన్నారు. ఒక్క రోజే ముగ్గురు మైనర్లపై అత్యాచారాలు జరిగితే... పోలీసులు, షీ టీమ్స్ ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు.
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ బాధితురాలి వివరాలను బీజేపీ ఎమ్మెల్యే రఘునందర్ రావు బయటపెట్టడం సరైన చర్య కాదని అన్నారు. అత్యాచార బాధితురాలి వివరాలను వెల్లడించడం నేరం చేయడమేనని చెప్పారు. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయడంలో తప్పు లేదని అన్నారు. రాష్ట్ర హోంమంత్రి పదవి నుంచి మహమూద్ అలీ తప్పుకోవాలని రేణుకా చౌదరి డిమాండ్ చేశారు.