Andhra Pradesh: తుని ఆర్టీసీ డిపోలో 11 వేల లీటర్ల డీజిల్ మాయం

11000 litres of diesel lost in tuni rtc depot

  • అండర్ గ్రౌండ్ ట్యాంక్ లీకవ్వడం వల్లేనంటున్న అధికారులు
  • నిన్న జరిగిన ఘటన
  • ఆర్టీసీ విజిలెన్స్ అధికారుల దర్యాప్తు

కాకినాడ జిల్లా తుని బస్సు డిపోలో డీజిల్ మాయమైపోయింది. 11 వేల లీటర్ల డీజిల్ కనిపించకుండా పోయింది. డిపోలోని గ్యారేజీ వద్ద భూమిలోపల డీజిల్ స్టోరేజీ ట్యాంకు లీకై డీజిల్ అంతా పోయిందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి డీజిల్ అంతా పోయినట్టు నిన్ననే గుర్తించినా ఆ విషయం బయటకు రాకుండా అధికారులు జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది. ఈ ఘటనపై ఆర్టీసీ విజిలెన్స్ అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. అండర్ గ్రౌండ్ లోని ట్యాంక్ లీకవ్వడం వల్లే డీజిల్ అంతా పోయిందా? లేకపోతే మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News