YSRCP: మ‌హిళ‌ల మూకుమ్మ‌డి విన‌తుల‌తో చెవులు మూసుకున్న వైసీపీ ఎమ్మెల్యే

jammalamadugu mla sudhir reddy get a strange experience in gadapagadapaku programme
  • ఎర్ర‌గుంట్ల‌లో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం
  • పాల్గొన్న జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
  • బోరు బావి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని మ‌హిళ‌ల విన‌తి
  • మ‌హిళ‌లంతా ఒక్క‌సారిగా గ‌ట్టిగా అర‌వ‌డంతో చెవులు మూసుకున్న ఎమ్మెల్యే
ఏపీలో అధికార పార్టీ వైసీపీ చేప‌ట్టిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో భాగంగా ఆ పార్టీ నేత‌ల‌కు కొన్ని చోట్ల ప్ర‌జ‌ల నుంచి నిల‌దీత‌లు ఎదుర‌వుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత జిల్లా క‌డ‌ప‌లోనూ బుధ‌వారం ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి చోటు‌చేసుకుంది. క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని నియోజక‌వ‌ర్గ మ‌హిళ‌లు నిల‌దీశారు. అంతేకాకుండా పెద్ద పెట్టున త‌మ సమ‌స్య‌ల‌ను వినిపించ‌డంతో సుధీర్ రెడ్డి త‌న చెవులు మూసుకున్నారు. 

ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకెళితే... జ‌మ్మ‌లమ‌డుగు ప‌రిధిలోని ఎర్ర‌గుంట్ల‌లో బుధ‌వారం చేప‌ట్టిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మంలో సుధీర్ రెడ్డి పాలుపంచుకున్నారు. ఈ క్ర‌మంలో గ్రామంలోని మ‌హేశ్వ‌ర‌న‌గ‌ర్‌కు ఎమ్మెల్యే వెళ్ల‌గా... బోరు బావి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని స్థానిక మ‌హిళ‌లు ఎమ్మెల్యేను కోరారు. ఈ సంద‌ర్భంగా మ‌హిళ‌లంతా ఒక్క‌సారిగా పెద్ద‌గా అరుస్తూ త‌మ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరగా... ఎమ్మెల్యే త‌న చెవులు మూసుకున్నారు. త్వ‌ర‌లోనే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని చెప్పి ఎమ్మెల్యే అక్క‌డి నుంచి బ‌య‌లుదేరారు.
YSRCP
Kadapa District
Jammalamadugu
Erarguntla
Sudhir Reddy

More Telugu News