Amul: ప్రధాని మోదీకి ప్రముఖ డెయిరీ సంస్థ అమూల్ విన్నపం

Amul writes letter to Modi

  • చిన్న ప్లాస్టిక్ స్ట్రాలపై నిషేధాన్ని విధిస్తూ కేంద్రం నిర్ణయం
  • నిషేధాన్ని కాస్త ఆలస్యం చేయాలని కోరిన అమూల్
  • రైతులు, పాల వినియోగంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వ్యాఖ్య 

చిన్న ప్లాస్టిక్ స్ట్రాస్ పై ప్రణాళికాబద్ధమైన నిషేధాన్ని కాస్త ఆలస్యం చేయాలని కోరుతూ ప్రధాని మోదీకి దేశంలోనే అతి పెద్ద డెయిరీ గ్రూప్ అమూల్ లేఖ రాసింది. స్ట్రాస్ పై నిషేధం రైతులు, పాల వినియోగంపై పతికూల ప్రభావాన్ని చూపుతుందని తెలిపింది. ఈ స్ట్రాస్ పై నిషేధం విధిస్తే చిన్న జ్యూస్ ప్యాకులు, డెయిరీ ఉత్పత్తుల ప్యాక్ లపై ప్రభావం పడుతుందని పేర్కొంది. 

అమూల్ ప్రతి ఏడాది ప్లాస్టిక్ స్ట్రాస్ తో కూడిన బిలియన్ల కొద్దీ చిన్న డెయిరీ కార్టన్ లను విక్రయిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అమూల్, పెప్సీకో, కోకాకోలా వంటి దిగ్గజ సంస్థలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. మరోవైపు ప్లాస్టిక్ స్ట్రాస్ స్థానంలో పేపర్ స్ట్రాలను వినియోగించాలని కేంద్రం ఇది వరకే సూచించింది.

  • Loading...

More Telugu News