Sensex: కుప్పకూలిన మార్కెట్లు.. వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్!

Black friday for Markets

  • మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిన కొత్త కరోనా కేసులు
  • 1,016 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
  • 276 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. కరోనా కేసులు పెరుగుతుండటం మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ఫలితాన్ని చూపాయి. దీనికి తోడు అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు తోడు కావడంతో మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,016 పాయింట్లు కోల్పోయి 54,303కి పడిపోయింది. నిఫ్టీ 276 పాయింట్లు పతనమై 16,201కి దిగజారింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఏసియన్ పెయింట్స్ (0.78%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.52%), డాక్టర్ రెడ్డీస్ (0.18%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.14%), టైటాన్ (0.12%). 

టాప్ లూజర్స్:
కోటక్ బ్యాంక్ (-3.96%), బజాజ్ ఫైనాన్స్ (-3.90%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-3.80%), రిలయన్స్ (-3.02%), విప్రో (-2.99%).

  • Loading...

More Telugu News