Hyderabad: గ్యాంగ్ రేప్ నిందితులంతా పోలీసు కస్టడీకి!.. జూబ్లీ హిల్స్ పీఎస్‌లోనే విచారణ!
- పోలీసు కస్టడీకి ఎమ్మెల్యే కుమారుడు సహా మరో మైనర్
- ఇప్పటికే పోలీసు కస్టడీలో నలుగురు నిందితులు
- రేపటి నుంచి మొత్తం ఆరుగురు నిందితులను విచారించనున్న పోలీసులు
జూబ్లీ హిల్స్‌లో చోటుచేసుకున్న గ్యాంగ్ రేప్ ఘటనలో శుక్రవారం కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో మేజర్‌గా ఉన్న సాదుద్దీన్‌తో పాటు ముగ్గురు మైనర్లను పోలీసు కస్టడీకి అనుమతించిన కోర్టు... ఈ కేసులో అరెస్టైన ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు సహా మరో మైనర్‌ను కూడా పోలీసు కస్టడీకి అనుమతిస్తూ తీర్పు చెప్పింది. వెరసి ఈ కేసులో నిందితులుగా ఉన్న అందరూ పోలీసు కస్టడీలోకి వెళ్లిపోయినట్టయింది.
ఇప్పటికే సాదుద్దీన్‌ను రెండు రోజుల పాటు విచారించిన పోలీసులు... శుక్రవారం ముగ్గురు మైనర్లను జువెనైల్ హోంలోనే విచారించారు. అయితే నిందితుల విచారణకు జువెనైల్ హోంలో అసౌకర్యంగా ఉన్న నేపథ్యంలో శనివారం నుంచి వారిని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించనున్నారు. తాజాగా ఎమ్మెల్యే కుమారుడు సహా మరో మైనర్‌ను కూడా పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించిన నేపథ్యంలో మొత్తం ఆరుగురు నిందితులను జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లోనే పోలీసులు విచారించనున్నారు. ఉదయం మైనర్లను జువెనైల్ హోం నుంచి స్టేషన్‌కు తీసుకురానున్న పోలీసులు...విచారణ ముగియగానే తిరిగి జువెనైల్ హోంకు తరలించనున్నారు.