Hyderabad: హైదరాబాదులో 100కి పైగా కరోనా కొత్త కేసుల నమోదు

Hyderabad registers hundred more corona positive cases

  • గత 24 గంటల్లో 15,200 కరోనా పరీక్షలు
  • తెలంగాణలో 145 మందికి పాజిటివ్
  • హైదరాబాదులో 117 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 75 మంది
  • ఇంకా 977 మందికి చికిత్స

తెలంగాణలో కరోనా వ్యాప్తి మళ్లీ ఊపందుకుంటోంది. గడచిన 24 గంటల్లో 15,200 కరోనా పరీక్షలు నిర్వహించగా, 145 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒక్క హైదరాబాదులోనే 117 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 75 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 7,94,329 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,89,241 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 977 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 4,111 మంది కరోనాతో మరణించారు.

  • Loading...

More Telugu News