bad breath: నోటి దుర్వాసనకు పరిష్కారాలు ఇవిగో.. 

solutions to get rid of bad breath

  • పళ్లల్లో సమస్యల వల్ల దుర్వాసన
  • కొన్ని రకాల వ్యాధుల్లోనూ నోటి నుంచి దుర్వాసన
  • దంత వైద్యులను సంప్రదించి కారణాన్ని తెలుసుకోవచ్చు
  • దుర్వాసన రాకుండా చేయడానికి ఎన్నో మార్గాలు

ఎదుటి వారి నోటి నుంచి దుర్వాసన వస్తుంటే వారితో సంభాషించడం చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. ఆ విషయం వారితో చెప్పలేము. అలా అని ఎక్కువ సేపు మాట్లాడలేము. కనుక వీలైనంత త్వరగా వారితో  సంభాషణ ముగించేయాలని ఎదుటి వారు అనుకుంటారు. అందుకే నోటి నుంచి దుర్వాసన రాకుండా చూసుకోవడం ప్రాథమిక పరిశుభ్రతలో భాగమని గుర్తించాలి.

కారణాలు
నోటి నుంచి దుర్వాసన రావడాన్ని హాలిటోసిస్ అంటారు. దంతాల శుభ్రత లోపించినప్పుడు, దంతాల ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు, పేగులు ఆరోగ్యంగా లేనప్పుడు, అసిడిటీ, మధుమేహం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, నీటిని తక్కువగా తీసుకోవడం ఇలా ఎన్నో కారణాల వల్ల ఈ సమస్య కనిపిస్తుంది. పొగ తాగడం, నమిలే పొగాకు ఉత్పత్తులు కూడా దుర్వాసనకు కారణం అవుతాయి. చిగుళ్ల వ్యాధుల్లోనూ దుర్వాసన వస్తుంది.  తరచూ ఏదో ఒకటి తింటూ ఉండడం, తీవ్ర మలబద్ధకం, నిద్ర పోయే సమయంలో నోటి ద్వారా శ్వాస తీసుకోవడం కూడా కారణం అయి ఉండొచ్చు.

గుర్తింపు
దంతవైద్యుడి వద్దకు వెళితే కారణాన్ని గుర్తించి చెబుతారు. పళ్లల్లో ఏవైనా పుచ్చులు ఉన్నా, పళ్ల మధ్య తిన్న ఆహారం ఇరుక్కుని కుళ్లిపోతున్నా, సరిగ్గా బ్రష్ చేసుకోకపోయినా తెలుస్తుంది. నోటి ఆరోగ్యం కోసం పాటించేందుకు ఎన్నో సులభ విధానాలు ఉన్నాయి. ఆయుర్వేదం, అల్లోపతి వీటి గురించి వివరంగా చెప్పాయి. 

  • పరిష్కారాలు..
    చిగుళ్ల వ్యాధి, చిగుళ్లలో బ్యాక్టీరియా పేరుకుపోవడం వల్ల దుర్వాసన వస్తున్నట్టు అయితే అందుకు దంతవైద్యులు మెడికేటెడ్ టూత్ పేస్ట్, ఇతర మందులను సిఫారసు చేస్తారు.
  • ఆహారం తిన్న వెంటనే బ్రష్ చేసుకోవాలి (రోజులో రెండు సార్లు). రాత్రి నిద్రించే ముందు తప్పనిసరి. రాత్రి నిద్రా సమయం ఎక్కువ. తిన్న ఆహార పదార్థాలు పళ్లల్లో ఉండిపోయినప్పుడు రాత్రి నిద్రా సమయంలో అవి పళ్లకు హాని చేసే బ్యాక్టీరియా వృద్దికి సాయపడతాయి. కనుక బ్రష్ చేసే నిద్రించాలి. 
  • పేగులు ఆరోగ్యంగా ఉండాలంటే.. పళ్లను కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. పళ్లలో ఇరుక్కున్న పదార్థాలన్నీ బ్రషింగ్ తో పోవు. అందుకే ఫ్లాసింగ్ చేసుకోవాలి. దారంతో పళ్లమధ్య ఉన్నవాటిని తొలగించడం. రోజుకు ఒక్కసారి అయినా చేసుకోవాలి.
  • నీరు తగినంత తీసుకోవాలి. దుర్వాసన వచ్చే వారు కూల్ డ్రింక్స్, ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. 
  • తరచూ కొద్ది కొద్దిగా నీరు తాగుతూ ఉండాలి. అది కూడా పుక్కిలించినట్టు చేసి నీరు తీసుకోవాలి. నోటిని డ్రైగా ఉంచుకోకూడదు. ఏ పదార్థం అయినా తిన్న వెంటనే నీటిని పుక్కిలించి వేయాలి. అంటే నోటిని కడుక్కున్నట్టు చేయడం.
  • ఎందుకంటే తిన్న ప్రతిసారి బ్రష్ చేయడం సాధ్యపడదు. అందుకనే టిఫిన్, లంచ్, స్నాక్స్, డిన్నర్ తప్ప మధ్య సమయాల్లో ఏవీ తీసుకోకుండా విరామం ఇవ్వాలి. ఈ విరామ సమయాల్లో నీరు తాగే ప్రతీసారి పుక్కిలించినట్టు చేయాలి. 
  • ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా దుర్వాసనకు కారణమవుతాయి. తీపి పదార్థాలు ఎక్కువగా తినడం కూడా ఈ సమస్యను కలిగిస్తాయి. కనుక వీటిని తగ్గించుకోవలి. 
  • టూత్ బ్రష్ ను ప్రతీ మూడు నెలలకు ఒకసారి మార్చడం మంచిది. కనీసం ఏడాదికి ఒకసారి అయినా డెంటిస్ట్ ను సంప్రదించడం మంచిది.

  • Loading...

More Telugu News