Southwest Monsoon: నైరుతి రుతుపవనాలపై ఐఎండీ అప్ డేట్ ఇదిగో!
- ఈసారి ముందే వచ్చిన నైరుతి
- దేశంలోకి ప్రవేశించడానికి ప్రతికూల వాతావరణం
- మందకొడిగా కదులుతున్న వైనం
- నిదానంగా విస్తరిస్తున్న రుతుపవనాలు
ముందుగానే కేరళ తీరాన్ని పలకరించినప్పటికీ, దేశంలోకి ప్రవేశించడానికి ఎంతో సమయం తీసుకున్న నైరుతి రుతుపవనాలు ఇప్పటికీ మందకొడిగానే కదులుతున్నాయి. దీనిపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తాజా సమాచారం అందించింది.
నైరుతి రుతుపవనాలు నేడు అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు, గుజరాత్ లోని కొన్ని ప్రాంతాలకు, కొంకణ్ ప్రాంతం మొత్తానికి, మధ్య మహారాష్ట్ర, మరట్వాడా, కర్ణాటకలో అత్యధిక ప్రాంతాలకు, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకు, బీహార్, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు, సబ్ హిమాలయన్ ప్రాంతాలు-పశ్చిమ బెంగాల్ లో అత్యధిక భాగానికి విస్తరించాయని వివరించింది.
రాగల ఐదు రోజుల్లో పశ్చిమ బెంగాల్ (సబ్ హిమాలయన్), సిక్కిం, ఈశాన్య భారతంలో విరివిగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.