Sensex: వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- మార్కెట్లను ప్రభావితం చేసిన ఆర్థిక సంక్షోభం భయాలు
- 153 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 42 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లో ముగిశాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో పాటు, మరో ఆర్థిక సంక్షోభం రాబోతోందనే అంచనాలు మార్కెట్లను ప్రభావితం చేశాయి. ఈరోజు ఉదయం నష్టాల్లోనే ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత కోలుకున్నాయి. అయితే వెంటనే మళ్లీ పతనమయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 153 పాయింట్లు కోల్పోయి 52,693కి పడిపోయింది. నిఫ్టీ 42 పాయింట్లు నష్టపోయి 15,732 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (1.63%), ఎన్టీపీసీ (1.61%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.42%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.19%), ఇన్ఫోసిస్ (1.13%).
టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.12%), టెక్ మహీంద్రా (-2.08%), రిలయన్స్ (-1.33%), మారుతి (-1.32%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.23%).