Sensex: మార్కెట్లకు ఈరోజు కూడా నష్టాలే
- వరుసగా నాలుగో రోజు నష్టపోయిన మార్కెట్లు
- 152 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 39 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు నష్టపోయాయి. అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూలతలు లేకపోవడం మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగుతూ చివరకు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 152 పాయింట్లు నష్టపోయి 52,541కి పడిపోయింది. నిఫ్టీ 39 పాయింట్లు కోల్పోయి 15,692 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (4.24%), బజాజ్ ఫైనాన్స్ (2.04%), టాటా స్టీల్ (1.52%), ఎల్ అండ్ టీ (0.97%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.83%).
టాప్ లూజర్స్:
ఎన్టీపీసీ (-2.02%), ఇన్ఫోసిస్ (-1.29%), రిలయన్స్ (-1.18%), విప్రో (-1.07%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.01%).